నా ఓటమికి కుట్ర జరిగింది.. కమల్ సంచలన వ్యాఖ్యలు..?

సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న కమల్ హాసన్ కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కమల్ హాసన్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కమల్ సైతం ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.

 Kamal Haasan Sensational Comments About Election Results-TeluguStop.com

అయితే తాజాగా తన ఓటమి గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర జరిగిందని కమల్ హాసన్ అన్నారు.

 Kamal Haasan Sensational Comments About Election Results-నా ఓటమికి కుట్ర జరిగింది.. కమల్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓటమి అనంతరం పార్టీ ప్రక్షాళనకు కమల్ హాసన్ సిద్ధమయ్యారు.పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పని చేసేవాళ్లను క్షమించబోనని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కమల్ హాసన్ కృంగిపోకుండా పార్టీని మరో లెవెల్ కు తీసుకెళుతానని కమల్ హాసన్ చెబుతున్నారు.ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా తాను పార్టీని ఏర్పాటు చేశానని కమల్ పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తన సొంత డబ్బేనని కమల్ హాసన్ పేర్కొన్నారు.

Telugu 33 Percent Votes, Assembly Election Results, Coimbatore South, Election Results, Kamal Hassan, Kamal Warning, Mnm Party, Tamil Nadu-Movie

ఇతర పార్టీలు సక్సెస్ కోసం అడ్డదారుల్లో ప్రయత్నాలు చేశాయని అయినప్పటికీ తనకు ఏకంగా 33 శాతం ఓట్లు వచ్చాయని కమల్ పేర్కొన్నారు.తనకు మరో 2వేల ఓట్లు వచ్చి ఉంటే హిస్టరీ క్రియేట్ చేసేవాళ్లమని కమల్ హాసన్ పేర్కొన్నారు.నిజాయితీతో కూడా రాజకీయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని కమల్ అన్నారు.

సక్సెస్ అనేది ఒక్క మాట కాద్నై నిరంతరం కృషి చేయడం ద్వారా మాత్రమే సక్సెస్ ను పొందడం సాధ్యమవుతుందని కమల్ హాసన్ వెల్లడించారు.పార్టీపై ఎవరైతే బురద జల్లుతారో వారి విషయంలో ఉపేక్షించనని కమల్ హాసన్ తెలిపారు.

ఎన్నికల్లో ఓటమి అనంతరం కూడా కార్యకర్తలు బలంగా పార్టీ కోసం పని చేస్తున్నారని కమల్ హాసన్ అన్నారు.

#Kamal Warning #Tamil Nadu #Kamal Hassan #MNM Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు