కరోనా ఎఫెక్ట్: ఇల్లు దానం చేస్తానంటున్న లోకనాయకుడు

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి దేశప్రజలు సురక్షితంగా ఉండేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ ప్రకటించింది.దీంతో ప్రజలందరూ ఇళ్లకే పిరిమితమయ్యారు.

 Kamal Haasan Ready To Donate House For Corona Virus Victims-TeluguStop.com

కాగా భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 550 దాటడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్న రాష్ట్రాలు, కరోనా పాజిటివ్ కేసులను ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు.కాగా తమిళనాడులో కూడా ఈ వైరస్ సోకిన వారు ఉండటంతో అక్కడి ప్రముఖులు తమకు తోచిన విధంగా ప్రభుత్వానికి చేయూతనిస్తున్నారు.తమిళ నటుడు కమల్ హాసన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 లక్షల విరాళం అందించగా, తాజాగా ఆయన తన నివాసాన్ని కూడా కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

అవసరమైతే తన ఇంటిని కరోనా బాధితుల చికిత్స కోసం ఆసుపత్రిలా వాడుకోవచ్చని ఆయన అన్నారు.ఏదేమైనా ఈ లోకనాయకుడు నిజమైన మహనీయుడని అక్కడి ప్రజలు కొనియాడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube