విక్రమ్ లో పోలీస్ ఆఫీసర్ గా కమల్ హసన్... 15 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రలో

సౌత్ ఇండియన్ లెజెండరీ యాక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఆయన చివరిగా మూడేళ్ళ క్రితం విశ్వరూపం2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

 Kamal Haasan Plays Police Officer Role In Vikram Movie-TeluguStop.com

ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీ స్టార్ట్ చేశారు.ఈ సినిమా సగం షూటింగ్ కూడా జరిగింది.

అయితే దర్శకుడు, నిర్మాతల మధ్య సయోధ్య లేకపోవడంతో మొదటి నుంచి ఇండియన్ 2 షూటింగ్ నత్తనడకగా సాగింది.తరువాత షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడంతో కొంతకాలం వాయిదా పడింది.

 Kamal Haasan Plays Police Officer Role In Vikram Movie-విక్రమ్ లో పోలీస్ ఆఫీసర్ గా కమల్ హాసన్… 15 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రలో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తరువాత లాక్ డౌన్ తో ఏడాది పాటు పోస్ట్ పోన్ అయ్యింది.అయితే లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ చేద్దామని దర్శకుడు శంకర్ చూసిన నిర్మాతల నుంచి స్పందన లేకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్ళిపోయారు.

అయితే లైకా నిర్మాతలు మాత్రం ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టి ఉన్నారు.దీంతో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందో, స్టార్ట్ అవుతుందో తెలియని సందిగ్ధంలో ఉంది.

ఈ నేపధ్యంలో లోకేష్ దర్శకత్వంలో చేస్తున్న విక్రమ్ సినిమాలో కమల్ హసన్ నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కమల్ హసన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

కమల్ చివరిగా రాఘవన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు.తరువాత మళ్ళీ ఏ ఇతర సినిమాలలో పూర్తిస్థాయిలో అలాంటి పోలీస్ పాత్రలో కనిపించలేదు.

అయితే విక్రమ్ సినిమాలో మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.అయితే రెగ్యులర్ పోలీస్ తరహాలో కాకుండా ఓ ఖైదీని కాపాడటానికి ప్రయత్నం చేసే పోలీస్ గా కమల్ హసన్ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

#Kamal Haasan #Vikram #Kollywood #Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు