శంకర్ ని పక్కన పెట్టిన కమల్ హసన్! ఆ సినిమాపై ద్రుష్టి పెట్టాడు  

క్షత్రియ పుత్రుడు రీమేక్ చేస్తున్న కమల్ హసన్.

Kamal Haasan Plan To Remake Kshatriya Putrudu Movie-

సౌత్ స్టార్ హీరో కమల్ హసన్ ఓ వైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు. లోక్ సభ ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్ధులని రంగంలోకి దించేసాడు. మరో వైపు సినిమాలు కూడా వరుసగా ఫినిష్ చేసి తమ డ్రీం ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఇక సినిమాకి వీడ్కోలు చెప్పాలనే ఆలోచనతో ఉన్నాడు..

శంకర్ ని పక్కన పెట్టిన కమల్ హసన్! ఆ సినిమాపై ద్రుష్టి పెట్టాడు-Kamal Haasan Plan To Remake Kshatriya Putrudu Movie

ఇదిలా ఉంటే శంకర్, కమల్ కాంబినేషన్ లో దశాబ్దం క్రితం వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడుకి సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. అయితే ఏవో ఆర్ధిక కారణాల వలన ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు అయిన తర్వాత అర్ధంతరంగా ఆగిపోయింది.

ఇదిలా ఉంటే తాజాగా కమల్ హసన్ భారతీయుడు సీక్వెల్ ని పక్కన పెట్టి తన కెరియర్ లో సూపర్ హిట్ చిత్రం అయిన క్షత్రియ పుత్రుడు రీమేక్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ రీమేక్ కథని ఇప్పటికే సిద్ధం చేసిన కమల్ హసన్ త్వరలో పొల్లాచ్చి లో షూటింగ్ మొదలెట్ట బోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. మరి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వచ్చిన క్షత్రియ పుత్రుడు రీమేక్ అంటే ఇప్పుడు కమల్ కథని ఎలా నడిపించాబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇది తండ్రి కొడుకుల కథగా ఉంటుంది అని, కమల్ హసన్ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అని టాక్ కోలీవుడ్ లో వినిపిస్తుంది.