Dasavatharam : ఆ ఒక్క సినిమా ఇండియా నుంచి నిజంగా ఆస్కార్ గెలుచుకోవాల్సింది ..!

నిజానికి ఇప్పటివరకు ఉన్న అన్ని సినిమాలలో కెల్లా ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుకు వెళ్ళవలసిన సినిమా అని చాలా సార్లు అనిపించింది.అది ఏంటంటే దశావతారం.

 Kamal Haasan Oscar Range Acting Dasavatharam-TeluguStop.com

కమల్ హాసన్ కి అవార్డులకు ఏమీ కొదవలేదు.జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి సాధ్యపడనని అవార్డులు సొంతం చేసుకున్నాడు.60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ కెరియర్ రన్నింగ్ లో ఉంది.ఇంత సాధించిన అతడికి ఉన్న ఏకైక అసంతృప్తి ఒక్క ఆస్కార్ అవార్డు మాత్రమే.

ఇప్పటికి తన సినిమాలో వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తూనే ఉన్నాయి.ఏడు, ఎనిమిది సార్లు కచ్చితంగా ఆస్కార్ లభిస్తుందని ప్రయత్నాలు చేశాడు కానీ ఏ ఒక్కటి కూడా ఆస్కార్ గడప తొక్క పోవడం విశేషం.

Telugu Dasavathaaram, Filmfare Award, Kamal Haasan, Kollywood, Oscar Range, Toll

ఇక చాలా మందితో పాటు కమలహాసన్ కూడా దశావతారం( Dasavathaaram ) వంటి సినిమాకు ఆస్కార్ లభించాల్సి ఉండేది అని అనుకున్నవారే.ఈ సినిమాలో భాష బేధం, జాతి బేధం, వృత్తి బేధం, లింగ బేధం, దేశ భేదం అనే విషయాలు అన్నీ కూడా కనిపించేలా పది పాత్రలను సెలెక్ట్ చేసుకుని ఆ అన్ని పాత్రలకు కూడా సరైన న్యాయం చేశాడు.వెరసి అద్భుతంగా నటించాడు కమల్ హాసన్.అయినా కూడా ఈ చిత్రం కనీసం ఇండియా నుంచి ఆస్కార్ లిస్టులో వెళ్లలేదు.అంతకు ముందు కూడా అనేక సినిమాలు ఆస్కార్ కి కమలహాసన్ దరఖాస్తు చేసుకున్నా కూడా రకరకాల కారణాలతో విఫలమవుతూ వస్తున్నారు.ఎందుకంటే ఆస్కార్ గెలవాలంటే టాలెంట్ మాత్రమే కాకుండా డబ్బు ఖర్చు కూడా చేయాలనే విషయం ఇప్పుడు రాజమౌళిని చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది.

Telugu Dasavathaaram, Filmfare Award, Kamal Haasan, Kollywood, Oscar Range, Toll

కమల్ హాసన్( Kamal haasan ) తన సినిమా జీవితంలో చేసిన ప్రయోగాలు మరొక నటుడు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు.తన జీవితంలో 19 ఫిలింఫేర్ అవార్డులు రాగా ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి.తన సొంత భాషా తమిళం అయినప్పటికీ కూడా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో అవార్డులు పొందాడు .ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఫిలింఫేర్ అవార్డు( filmfare award )ల ఇకపై నాకు ఎలాంటివి ఇవ్వద్దు అంటూ సదరు అసోసియేషన్ వారికి లేఖ కూడా రాశారట కమల్ హాసన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube