ఆయన పార్టీలో చేరాలంటే రూ.25,000 కట్టాల్సిందే..!

ప్రఖ్యాత సినీ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడుగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తనదైన శైలిలో అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే విధానాన్ని మొద‌లు పెట్టారనే అని చెప్పాలి.

 Kamal Haasan Party Calls For Candidate Polls, Online Applications, Tamilnadu As-TeluguStop.com

ఆ పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు ఎవరయినా గాని 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌ లైన్‌ లో ముందుగా ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం మీడియా సందర్బంగా పేర్కొన్నారు.అలాగే పార్టీతో సంబంధం లేకుండా ఉన్నవరైన ఎవరయినా కూడా డబ్బులు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు.

మరో రెండు నెలల్లో అంటే మే నెలలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం క‌మ‌ల్ తమ పార్టీ గుర్తుని కూడా బయటపెట్టారు.ఆయన బ్యాట‌రీ టార్చ్ సింబ‌ల్‌ తో ఎన్నికలో బరి లోకి దిగి పోటీ చేయ‌నున్నారు.

కమల్ కాలుకి కొన్ని రోజుల క్రితం దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.ప్రస్తుతం క‌మ‌ల్ త‌న కాలుకు శ‌స్త్ర చికిత్స చేయించుకుంటున్నాడు.కాలు కదపలేని పరిస్థితి కావున ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.ఇంకా వ‌చ్చే నెల నుండి పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని మానిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.మొత్తం అన్ని నియాజక వర్గాల్లో కూడా ఆయ‌న పార్టీ పోటీ చేయ‌నుంద‌ని క‌మ‌ల్ గతంలోనే స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కమల్ చేయబోయే సినిమాల విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం భార‌తీయుడు 2 చిత్రం షూటింగ్ మొద‌లు పెట్టారు.కానీ, క‌మ‌ల్ ఎల‌క్ష‌న్స్ దగ్గర పడడంతో ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసి ఎలక్షన్స్ అయిన తరువాత పూర్తి చేయ‌నున్నాడ‌ని తమిళ ఇండస్ట్రీ నుంచి అందిన సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube