సౌత్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ ఇండియన్ 2.దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది.
శంకర్ దర్శకత్వంలో యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రెండేళ్ల క్రితం ప్రారంభం అయ్యింది.కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగుతూ సాగుతూ వస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమా క్రేన్ యాక్సిడెంట్ కారణంగా సినిమా షూటింగ్ చాలా నెలలుగా ఆగిపోయింది.పైగా కరోనా కారణంగా కూడా ఇండియన్ 2 సినిమా నిలిచి పోయింది.
ఇక మరో మూడు నాలుగు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.ఆ కారణంగా ఇండియన్ 2 సినిమా పునః ప్రారంభం అవ్వడం సాధ్యం అయ్యే విషయం కాదని తేలిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ కంటెస్టెంట్ చేయబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.ఈ సమయంలో సినిమా షూటింగ్ అంటూ బిజీ అయితే రాజకీయంగా విమర్శలు రావడంతో పాటు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.అందుకే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాతే ఇండియన్ 2 సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
ఈలోపు చిన్న సినిమాలు ఏమైనా చేయడంతో పాటు ప్రముఖ షో బిగ్‌బాస్‌ను కూడా చేసే విషయమై కమల్ బిజీగా ఉన్నాడు.తమిళ బిగ్‌బాస్ నాల్గవ సీజన్ కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయంగా వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నాడు.
పార్టీ కార్యకర్తలతో భేటీలు అభ్యర్థుల ఎంపిక విషయమై ఏర్పాట్లు జరుగుతున్నాయి.కమల్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా ఎన్నికల ముందు వరకు ఈ సినిమాను విడుదల చేయాలని చాలా కోరుకున్నాడు.కాని పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఎన్నికల తర్వాత పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.