హిందుత్వ వ్యతిరేక విధానాలు కమల్ రాజకీయ భవిష్యత్తుకి సమాధి అవుతాయా

విలక్షణ నటుడు కమల్ హసన్ నటుడుగా ఏ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడో.అదే స్థాయిలో తన వ్యక్తిత్వంతో సొసైటీలో వివాదాలతో సావాసం చేస్తూ వస్తున్నాడు.

 Kamal Haasan Ideology Is Not Gain Political Millage In Tamilanadu-TeluguStop.com

తనని తాను లౌకికవాదిగా, భౌతిక వాదిగా, దేవుడిని అస్సలు విశ్వసించని వ్యక్తిగా పరిచయం చేసుకున్న కమల్ హాసన్ దానికి తగ్గట్లుగానే ఎప్పుడు వాఖ్యలు చేస్తూ ఉంటారు.అతని సినిమాలలో కూడా కమల్ హాసన్ భావజాలం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

అయితే సినిమాల వరకు అతను ఎలా ఉన్నా సినిమా బాగుంటే చూస్తారు, బాగోలేకపోతే తిప్పి కొడతారు.కాని ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టు ప్రజల మధ్యలోకి వచ్చారు.

అయిన కూడా కమల్ హాసన్ తన పంథా మార్చుకోకుండా తమిళ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని అనుకుంటున్నారు.అయితే కమల్ హాసన్ రాజకీయ భవిష్యత్తుకి ప్రధాన అడ్డంకి అతను దైవ వ్యతిరేకి కావడమే అనేది చాలా మంది చెప్పే మాట.ఎక్కువగా లౌకిక వాద బావజాలంలో ఉండే కమల్ హాసన్ హిందుత్వ విధానాలని, ఆచారాల్ని, సంప్రదాయాలని తప్పుపడుతూ ఉంటాడు.తాజాగా గాడ్సే మొట్టమొదటి హిందుత్వ ఉగ్రవాది అంటూ దేశం ద్వేషించి ఒక వ్యక్తికి మతాన్ని అంతగాట్టాడు.

ఇది చాలా మందికి నచ్చకపోయిన కమల్ హాసన్ మాత్రం తన మాటలకి కట్టుబడి ఉన్నాడు.ఇదిలా ఉంటే ఎక్కువగా హిందుత్వ బావలాజంతో ఉండే ప్రజలు తమిళనాడులో ఉంటారు.

దానికి తగ్గట్లుగానే అక్కడే హిందూ దేవాలయాలు ఎక్కువ.అలాంటి చోట హిందూ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కమల్ హాసన్ ఎంత వరకు రాజకీయంగా ముందడుగు వేయగలడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube