ఇండియాలో తొలి టెర్రరిస్ట్‌ హిందువే  

Kamal Haasan Hindu Terrarium Comments-kamal Haasan,telugu News,కమల్ హాసన్,తెలుగు న్యూస్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లీంల ఓట్లను ఆకర్షించేందుకు హిందువులపై విమర్శలు, హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు ముస్లీంలను విమర్శించడం చాలా కామన్‌గా కనిపిస్తుంది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్దం అయినా కూడా ఏ ఒక్కరు కూడా తగ్గడం లేదు. ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి హేట్‌ స్పీచ్‌లు వినిపస్తునే ఉన్నాయి...

ఇండియాలో తొలి టెర్రరిస్ట్‌ హిందువే-Kamal Haasan Hindu Terrarium Comments

తాజాగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.కమల్‌ హాసన్‌ తాజాగా ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం పెరిగి పోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే స్వాతంత్య్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది హిందువు అంటూ కమల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మహాత్మ గాంధీని చంపేసింది ఒక హిందుత్వ వాది అని, అతడు హిందూ సభ సభ్యుడు అంటూ కమల్‌ గుర్తు చేశాడు.కమల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓట్ల కోసం ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, అసలు సమాజంలో కులం మతం అనే అసమానతలు లేకుండా చేయాలని కోరుకుంటున్న కమల్‌ హాసన్‌ హిందూ ఉగ్రవాదం గురించి మాట్లాడటం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ సమయంలోనే బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో కమల్‌పై విరుచుకు పడుతున్నారు.