హాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్న అక్కా చెల్లెలు  

Kamal Haasan daughters ready to act in Hollywood remake, Tollywood, Hollywood, Kollywood, Shruti Hassan, Akshara Haasan - Telugu Akshara Haasan, Hollywood, Kamal Haasan Daughters Ready To Act In Hollywood Remake, Kollywood, Shruti Hassan, Tollywood

స్టార్ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటీమణులు శృతిహాసన్, అక్షర హాసన్.శృతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత సౌతిండియాలో స్టార్ హీరోయిన్ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

 Kamal Haasan Daughters Ready To Act In Hollywood Remake

మల్టీ టాలెంటెడ్ అయిన శృతిహాసన్ సింగర్ గా కూడా సత్తా చాటింది.తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన శృతిహాసన్ కాటమరాయుడు తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి మరల క్రాక్ సినిమాతో తన హవా కొనసాగించడానికి సిద్ధమవుతుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకి శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఈ సినిమాలో శృతిహాసన్ చెల్లి అక్షర హాసన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం.

హాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్న అక్కా చెల్లెలు-Movie-Telugu Tollywood Photo Image

ఇందులో మరో కీలక పాత్ర కోసం చియాన్ విక్రమ్ నటిస్తున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన డోంట్ బ్రీత్ రీమేక్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్లో మంచి వసూళ్లు రాబట్టింది.కోలీవుడ్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.ఇది ముగ్గురు టీనేజ్ దొంగలు చుట్టూ తిరిగే కథాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.యాక్టర్స్ గా కెరీర్ ప్రారంభించిన తర్వాత శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

అయితే ఇందులో అక్షర చేస్తున్నది కేవలం గెస్ట్ అప్పియరెన్స్ పాత్ర మాత్రమే అనే టాక్ వినిపిస్తోంది.రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా, హీరోయిన్ పాత్రలతో కాకుండా కొత్తగా తనని తాను రిప్రజెంట్ చేసుకుంటున్న అక్షరహాసన్ ఈ సినిమాలో కూడా మరో కొత్త పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది.

మరి మొదటి సారి తెరపై కనిపించబోతున్న అక్కచెల్లెళ్ళు ఇద్దరు ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అనేది వేచి చూడాలి.

#Hollywood #Kollywood #Shruti Hassan #Akshara Haasan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kamal Haasan Daughters Ready To Act In Hollywood Remake Related Telugu News,Photos/Pics,Images..