లైంగిక దాడులపై ఉద్యమం చేస్తున్న చిన్మయికి 'కమల్' కౌంటర్.! చిన్మయి పేరు తీయకుండా ఏమన్నారంటే.?   Kamal Haasan Counter To Singer Chinmayi     2018-10-13   11:12:34  IST  Sainath G

చిన్మయి…మంచి సింగర్ కంటే సమంత కి వాయిస్ ఇచ్చిన సింగర్ అంటే అందరు గుర్తుపడతారు అనుకుంట. ‘ఏమాయ చేశావే’ సినిమాలో హస్కీ వాయిస్‌తో సమంతకు డబ్బింగ్ చెప్పి సమంత కి కుర్రకారులు ఫ్లాట్ అవ్వడానికి పరోక్షంగా కారణంగా మారింది చిన్మయి. తర్వాత హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ను పెళ్లిచేసుకుంది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగింది అని సోషల్ మీడియాలో ట్రెండవుతున్న #MeToo‌లో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్న విషయం అందరికి తెలిసిందే. మన దగ్గర శ్రీరెడ్డి లాగా అక్కడ చిన్మయి అందరి భాగోతాన్ని బయటపెడుతోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ వ్యవహారంపై స్పందించారు. చిన్మయి పేరు బయటకి తీయకుండా ట్వీట్ చేసారు. ‘‘ఈ వివాదంపై బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు సైతం దీనిపై మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాల వల్లే ఇది వివాదానికి దారితీస్తుంది. #MeToo ఉద్యమంలో నిజాయితీ ఉంటే తప్పకుండా స్వాగతిస్తాను. తప్పుడు ఆరోపణలతో ఈ ఉద్యమం నీరుగారకూడదని కోరుకుంటాను. ఈ ఉద్యమం స్వచ్ఛంగా ఉండాలి. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలకు కూడా అవగాహన కలగాలి’’ అని తెలిపారు.