షూటింగ్ ప్రమాదంపై పోలీస్ స్టేషన్ కి వెళ్లిన స్టార్ హీరో...  

Kamal Haasan Attends To The Police Station - Telugu Kamal Haasan, Kamal Haasan Attend Police Station, Kamal Haasan Bharateeyudu 2 Movie, Kamal Haasan Latest News, Kamal Haasan Movie News, Kamal Haasan News

ప్రస్తుతం తమిళ  విలక్షణ నటుడు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం మహిస్తున్న భారతీయుడు 2 అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం అప్పట్లో లంచం అనే అంశంపై తెరకెక్కినటువంటి భారతీయుడు అనే చిత్రానికి సీక్వెల్ గా ఉంది.

Kamal Haasan Attends To The Police Station

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయకులుగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా గత నెల 19వ తారీఖున అనుకోకుండా క్రేన్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక లైట్ మెన్ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.అంతేగాక కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాజల్ అగర్వాల్ తదితరులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

దీంతో తాజాగా ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు హీరో కమల్ హాసన్ ని చెన్నై ఎగ్మోర్ పోలీసులు పోలీస్ స్టేషన్ కి పిలిచారు.ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన తీరుపై దాదాపుగా మూడు గంటలు పాటు కమల్ హాసన్ ని విచారించినట్లు తెలుస్తోంది.

 అయితే విచారణ అనంతరం కమలహాసన్ మీడియా ముందు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరుపై తనని విచారించినట్లు తెలిపాడు.అంతేగాక ఈ ఘటనకు సంబంధించినటువంటి పలు ప్రశ్నలను కూడా అధికారులు అడిగి సమాధానాలు తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి అయినటువంటి చిత్రం ఆఖరిలో ప్రమాదం జరగడంతో ప్రస్తుతం కొంతకాలంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు దర్శకుడు శంకర్ అవగాహన లోపం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ ఈ ప్రమాదానికి దర్శకుడు శంకర్ ని పూర్తి బాధ్యుడిని చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kamal Haasan Attends To The Police Station Related Telugu News,Photos/Pics,Images..

footer-test