కమల్ హాసన్, ఫాహద్, విజయ్ సేతుపతి.. భారీ మల్టీ స్టారర్.. పవర్ ఫుల్ కథతో?

ఒక సినిమాలో ఒక స్టార్ హీరో ఉండటం మామూలే.కానీ ఒక సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఉండటం అంటే ఆ సినిమాకు ఉన్నా క్రేజే వేరు.

 Vikram Movie Shooting In Coimbatore, Kamal Haasan, Vijay Sethuapthi, Fahad Faasi-TeluguStop.com

ఇక స్టార్ హీరోలు ఉన్నట్లయితే ఆ సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.

మంచి సక్సెస్ లు కూడా అందుకున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో ముగ్గురు స్టార్ హీరోల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతుంది.

ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్.ఈ ముగ్గురి కాంబినేషన్ లో పవర్ఫుల్ కథతో ఓ సినిమా తెరకెక్కనుంది.ఇక ఇందులో కమల్ హాసన్ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు.నటన పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Telugu Coimbatore, Fahad Faasil, Kamal Haasan, Multi Starrer, Vikram-Movie

ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కేవలం తెలుగు, తమిళ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.ఇక ఈయన నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.గతంలో రాజకీయంగా పోటీ చేసిన ఈయన ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అవకాశాలు అందుకుంటున్నాడు.

Telugu Coimbatore, Fahad Faasil, Kamal Haasan, Multi Starrer, Vikram-Movie

ప్రస్తుతం ఈయన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ కూడా విడుదల కాగా అందులో ఎక్కువగా ఫైట్ సీన్స్ మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉంటే భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది.

Telugu Coimbatore, Fahad Faasil, Kamal Haasan, Multi Starrer, Vikram-Movie

తాజాగా ఈ సినిమా షెడ్యూల్ కోయంబత్తూర్ లో ప్రారంభమైంది.ఈ షెడ్యూల్ కంటే ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలన్నీ విడివిడిగా తీసినట్లు తెలిసింది.ఇక ఈ షెడ్యూల్ లో ఈ ముగ్గురు కాంబినేషన్ లో సన్నివేశాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి ఎంతో మంది అభిమానులు ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నామని తెలుపుతున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా కమల్ హాసన్, ఫాహద్, విజయ్ సేతుపతి లు ఉండగా ఆ లుక్స్ మాత్రం అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి.

పైగా ముగ్గురు ఓకే లెవెన్ లుక్ తో కనిపించగా ఈ సినిమా కథ బాగా పవర్ ఫుల్ గానే ఉంటుంది అని అనుకుంటున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అవ్వగా వాయిదా పడింది.

ప్రస్తుతం తిరిగి షూటింగ్ ను ప్రారంభించింది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube