అన్ని మతాల్లో నూ ఉగ్రవాదులు ఉన్నారు అంటూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కమల్

ఇటీవల సంచలన వ్యాఖ్యల తో వార్తలలో నిలిచిన మక్కల్ నీది మయ్యం అధినేత,సినీ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.స్వతంత్ర భారతదేశం లో మొట్ట మొదటి ఉగ్రవాది హిందువే నేనంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

 Kamal Explanation About His Controversial Remarks-TeluguStop.com

ఆయన వ్యాఖ్యలు చేసిన ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కమల్ వ్యాఖ్యలపై సంస్థలు,బీజేపీ నేతలు మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తరువాత ప్రచారం కోసం అని వెళ్లిన కమల్ పై చెప్పలు విసిరిన ఘటన కూడా చోటుచేసుకుంది.

అయితే తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత తతంగం అయిన తరువాత ఇప్పుడు కమల్ నోరు విప్పి వివరణ ఇచ్చారు.

అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నాడు.

తన మాటలకు వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయడంలేదని.కానీ అన్ని మతాల్లోనూ టెర్రరిస్ట్ లు ఉన్నారంటూ ఎవరూ తాము ఉత్తములని చెప్పుకోరని ఈ సందర్భంగా కమల్ పేర్కొన్నాడు.

ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుట్లో కనుమరుగయ్యాయని ఆయన తెలిపాడు.ఆ రోజు తాను మతసామరస్యం గురించి మాట్లాడానని.

హిందూ, ముస్లిం, క్రైస్తవుల నాయకులతో తాను భేటీ అవుతానని చెప్పాడు.ఇక తనపై చెప్పులు విసిరినాా, రాళ్లు విసిరినా పెద్దగా బాధపడనని ఈ సందర్భంగా కమల్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube