మొట్ట మొదటి ఉగ్రవాది హిందువేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్  

Kamal Controversial Comments On Hindus-gandhi,road Show,కమల్

ప్రముఖ సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతంలో మొట్ట మొదటి ఉగ్రవాది హిందువే నంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగముగా అరవాక్కురిచ్చిలో రోడ్ షో లో పాల్గొన్న కమల్ పై మేరకు వ్యాఖ్యలు చేశారు..

మొట్ట మొదటి ఉగ్రవాది హిందువేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ -Kamal Controversial Comments On Hindus

స్వతంత్ర భారతంలో మొట్టమొదటి టెర్రరిస్ట్ హిందువే నని,మహాత్మా గాంధీ ని హత్య చేసిన గాడ్సే హిందూ మహాసభ నేత అంటూ కమల్ వ్యాఖ్యానించారు. అరక్కురిచ్చిలో వాస్తవానికి ముస్లిం లు ఎక్కువగా ఉండే ప్రాంతం. అయితే రోడ్ షో లో పాల్గొన్న కమల్ ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని నేను ఈ వాఖ్యలు చేయడం లేదని, ‘గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నా.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే అని కమల్ వ్యాఖ్యానించారు. అసలు ఈ ఉగ్రవాదం అనేది మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఆరంభమైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

అయితే మరోపక్క కమల్ వ్యాఖ్యలను పలు హిందూ సంఘాలు ఖండించడమే కాకుండా కమల్ హిందూవుల పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు గతంలో కూడా తమిళనాడు మాజీ సి ఎం,దివంగత నేత జయలలిత పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ ఎన్నోసార్లు వార్తలలో హాట్ టాపిక్ గా మారారు.

ఇటీవల ఆయన సొంత పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రోడ్ షో లో పాల్గొన్న కమల్ హిందూ సంఘాలు ఆగ్రహించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.