యంగ్ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన కళ్యాణ్ రామ్.. ఎవరంటే?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టాలీవుడ్ హీరోల్లో ఒకరు.అయితే ఈయన తన తమ్ముడు లాగా వరుస హిట్స్ అందుకోలేక పోతున్నాడు.

 Kalyan Ram’s Next Movie With Prasanth Varma , Kalyan Ram ,bimbisara 2, amigos-TeluguStop.com

ఒకపక్క ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోగా కళ్యాణ్ రామ్ మాత్రం ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు.అయితే ఇది నిన్నటి వరకు మాట.ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అదిరిపోయే హిట్ కొట్టాడు.

ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ‘బింబిసార’ సినిమాను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కించారు.ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక తాజాగా కళ్యాణ్ రామ్ లైనప్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త అందుతుంది.కళ్యాణ్ రామ్ మరో యంగ్ డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రశాంత్ వర్మ అని అంటున్నారు.

వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అని అందుకు సంబంధించిన కథపై చర్చ కూడా జరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్టోరీ లైన్ కూడా వినిపించాడని కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని తెలుస్తుంది.ప్రశాంత్ వర్మ బాలయ్య అన్ స్టాపబుల్ 2 షో టీజర్ కూడా దర్శకత్వం వహించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.ఈయన పనితనం చూసి బాలయ్య కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.

కానీ ఈయన లైనప్ లో సినిమాలు ఉండడం వల్ల ఆ లైనప్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా ఉండే అవకాశం ఉంది.చూడాలి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందో.

ఇక ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube