కళ్యాణ్‌ రామ్‌కు కలిసి వచ్చిన సెలవులు... 118 కలెక్షన్స్‌  

Kalyan Ram\'s New 118 Movie Collections-kalyan Ram,kalyan Ram Movie Collections,nivetha Thamas

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సక్సెస్‌ ఫ్లాప్‌ అనే విషయాలను పక్కన పెట్టి వరుసగా చిత్రాలను చేస్తూనే ఉన్నాడు. తాజాగా 118 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీగా అంచనాలు లేకుండానే విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడంలో కూడా విఫలం అయ్యింది. దాంతో కలెక్షన్స్‌ రావడం అనుమానమే అని అంతా అనుకున్నారు..

కళ్యాణ్‌ రామ్‌కు కలిసి వచ్చిన సెలవులు... 118 కలెక్షన్స్‌-Kalyan Ram's New 118 Movie Collections

మొదటి రోజు కలెక్షన్స్‌ చూస్తే నిరాశజనకంగా ఉన్నాయన్నారు. అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 8 కోట్లకు ఈ సినిమా అమ్ముడు పోయింది. అయితే ఆ మొత్తం వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి.

మొదటి నాలుగు రోజుల్లో దాదాపుగా 5.8 కోట్ల రూపాయలను ఈ చిత్రం రాబట్టింది. మరో రెండు కోట్ల రూపాయలు మాత్రమే బ్యాలన్స్‌ ఉంది.

సోమవారం శివరాత్రి సెలవు అవ్వడంతో 118 చిత్రంకు కలిసి వచ్చింది. శని, ఆది, సోమ వారాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌కు చేరువ అయ్యింది. వారం రోజుల్లో కాకున్నా లాంగ్‌ రన్‌లో అయినా 8 కోట్లను ఈ చిత్రం దాటుతుందనే టాక్‌ వినిపిస్తుంది..

మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు :

నైజామ్ – 2.44 కోట్లుమొత్తం – 5.44 కోట్లు .