తమ్ముడిని నాకోసం వాడుకోవాలనే ఉద్దేశ్యం లేదు  

I Have No Intention Of Using My Younger Brother Jr Ntr For Me-balakrishna,jr Ntr,kalyan Ram,sarileru Nikevvaru,yentha Manchi Vadavu Raa

ఇండస్ట్రీలో అన్న తమ్ముడు మామ చిన్నాయన ఇలా ఎవరో ఒకరు ఉంటే వారిని పట్టుకుని పరిచయం అయ్యే వారు చాలా మంది ఉంటారు.వారికి స్టార్‌ ఇమేజ్‌ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు.ఎంతగా వాడాలో అంతగా వాడేసుకుంటూ ఉంటారు.స్టార్స్‌ కూడా వారికి సంబంధించిన వారిని ఎక్కువగా ప్రమోట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

I Have No Intention Of Using My Younger Brother Jr Ntr For Me-balakrishna,jr Ntr,kalyan Ram,sarileru Nikevvaru,yentha Manchi Vadavu Raa Telugu Tollywood Movie Cinema Film Latest News-I Have No Intention Of Using My Younger Brother Jr NTR For Me-Balakrishna Jr Ntr Kalyan Ram Sarileru Nikevvaru Yentha Manchi Vadavu Raa

అయితే కొందరు మాత్రం స్టార్స్‌ సపోర్ట్‌ ఉన్నా కూడా ఆ సపోర్ట్‌ను వాడుకునేందుకు ఆసక్తి చూపించరు.అలాంటి జాబితాలో ఉండే వ్యక్తి కళ్యాణ్‌ రామ్‌.తాజాగా కళ్యాణ్‌ రామ్‌ నటించిన ఎంత మంచివాడవురా సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.

ఆ సినిమాకు ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ పాల్గొన్నాడు.

తమ్ముడిని ఇలా చిన్ని చిన్న విషయాలకు మాత్రమే వాడుతున్న కళ్యాణ్‌ రామ్‌ పెద్ద అవసరాలకు మాత్రం వాడబోను అంటూ చెప్పుకొచ్చాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ స్వయంగా కళ్యాణ్‌ రామ్‌ బ్యానర్‌లో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట.

కాని కళ్యాణ్‌ రామ్‌ మాత్రం తాను తమ్ముడిని అలా వాడుకోవాలనుకోవడం లేదు అన్నాడట.

తమ్ముడి సినిమాలో నటించి స్టార్‌ డంను దక్కించుకోవచ్చు కదా అంటూ ప్రశ్నించగా నాకు ఆ అవసరం లేదని తమ్ముడితో అలాంటి పనులు చేయించుకోను అన్నాడట.

నాకు వచ్చిన సినిమాలు చేస్తాను, అంతే తప్ప తమ్ముడికి నేను భారం అవ్వాలనుకోవడం లేదు అంటూ కళ్యాణ్‌ రామ్‌ అన్నాడు.ఎంత మంచి వాడవురా సినిమాతో సక్సెస్‌ కొట్టాలని ఆశ పడుతున్నాడు.

తాజా వార్తలు