ఎన్టీఆర్‌ను ఫుల్‌గా వాడేస్తున్నాడుగా..!     2018-06-13   04:56:47  IST  Raghu V

కొంత కాలం ముందు వరకు నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటి, ఎన్టీఆర్‌ ఒక్కడు ఒక్కటి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు తన బందువుల అమ్మాయితో వివాహం చేయడంతో కుటుంబం అంతా కలిసి పోయినట్లు అయ్యింది. ఆ మద్య ఎన్టీఆర్‌, బాలకృష్ణ మద్య సన్నిహిత సంబంధాలు, ఎన్టీఆర్‌ తన తండ్రి హరికృష్ణతో కలిసి పోవడం, ఇద్దరు అన్నలతో ఎన్టీఆర్‌ సరదాగా ఎంజాయ్‌ చేయడం చూశాం. ఆ తర్వాత తెలుగు దేశంలో ఎన్టీఆర్‌ ప్రభావం పెరుగుతుందని గ్రహించిన బాలకృష్ణ మరియు చంద్రబాబు నాయుడులు వెంటనే ఆయన్ను తప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

దాదాపు ఆరు ఏడు సంవత్సరాలుగా బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌లకు మద్య సన్నిహిత సంబంధాు లేవు. ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ను చేరదీసే అవకాశం కనిపించడం లేదు. కాని ఎన్టీఆర్‌ మాత్రం బాబాయి పిలిస్తే ఎప్పుడైనా వెళ్తాను అంటూ సన్నిహితుల వద్ద చెబుతూ వస్తున్నాడు. తెలుగు దేశం పార్టీని ఎక్కడ తనవైపుకు లాక్కుంటాడో అనే భయంతోనే ఎన్టీఆర్‌ను బాలయ్య దూరం పెడుతున్నాడు అని, తన అల్లుడు లోకేష్‌ ఎక్కడ అధికారంలోకి రాకుండా పోతాడో అనే భయం బాలయ్యకు ఉంది. అందుకే బాలయ్య చాలా దూరంగా ఎన్టీఆర్‌కు ఉంటున్నాడు. కాని కళ్యాణ్‌ రామ్‌ మాత్రం తమ్ముడు ఎన్టీఆర్‌కు చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు.