బాలయ్య కోసం కష్టపడుతున్న కళ్యాణ్ రామ్.. తోడుగా వస్తోన్న తారక్  

Kalyan Ram Trying Multi Starrer With Balakrishna Ntr - Telugu Balakrishna, Kalyan Ram, Multi Starrer, Ntr, Tollywood News

నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ భారీ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి నట వారసత్వాన్ని విజయవంతంగా తమ భుజాలపై మోస్తూ ఇతర హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు.

 Kalyan Ram Trying Multi Starrer With Balakrishna Ntr

కాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే గతంలో వీరిద్దరితో కలిసి సినిమా చేయాలని పలువురు ప్రయత్నించినా అది విఫలయత్నంగా మిగిలింది.

బాలయ్య కోసం కష్టపడుతున్న కళ్యాణ్ రామ్.. తోడుగా వస్తోన్న తారక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో బాలయ్య-తారక్‌ల మల్టీస్టారర్ సినిమా ఇక అసాధ్యం అని అందరూ అనుకున్నారు.కానీ నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం తమ కుటుంబానికి చెందిన హీరోలతో ఖచ్చితంగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో బాలయ్య-తారక్‌ల కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను రెడీ చేయాల్సిందిగా పలువురు డైరెక్టర్లకు సూచించాడట.
కానీ ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పట్లో తెరకెక్కే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

మరో రెండేళ్ల వరకు తారక్ బిజీగా ఉంటాడు.దీంతో రెండేళ్ల తరువాత వీరిద్దరితో కలిసి కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు.

వీలైతే తాను కూడా ఈ సినిమాలో కలిసి నటించేందుకు ప్రయత్నం చేస్తున్నాడట.తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై ఈ సినిమాను తెరకెక్కించేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు.

మరి నందమూరి ఫ్యామిలీ నుండి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kalyan Ram Trying Multi Starrer With Balakrishna Ntr Related Telugu News,Photos/Pics,Images..