బింబిసార 2 ఆ రిస్క్ చేస్తానంటున్న కళ్యాణ్ రామ్..!

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో తెరకెక్కిన బింబిసార సినిమా ప్రేక్షకులను మెప్పించింది.సినిమా రిలీజైన 3వ రోజు నుంచే లాభాల బాట పట్టింది.

 Kalyan Ram Taking Risk For Bimbisara 2 Details, Bimbisara, Bimbisara 2, Bimbisar-TeluguStop.com

కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా బింబిసార దూసుకెళ్తుంది.అయితే బింబిసార రిలీజ్ టైం లోనే పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ చెప్పారు.

ఇక ఇప్పుడు సినిమా అనుకున్న రేంజ్ కన్నా పెద్దగా హిట్ అయ్యింది.ఇప్పుడు ఖచ్చితంగా బింబిసార 2 తీసి తీరాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

బింబిసార 2 సినిమా ఉంటుందని అంటున్నారు కళ్యాణ్ రామ్.అయితే పార్ట్ 2 ని ఇలా తక్కువ బడ్జెట్ లా కాకుండా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

బింబిసార సినిమాని 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.థియేట్రికల్ బిజినెస్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ అన్ని కలుపుకుని సినిమా లాభాలు తెచ్చింది.అయితే బింబిసార 2 ఇంకా ఎక్కువ బడ్జెట్ అంటున్నారు కళ్యాణ్ రామ్ రేంజ్ కి 100 ల కోట్ల బడ్జెట్ అంటే రొస్క్ అని చెప్పొచ్చు.అయితే బింబిసార 2లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని కూడా ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.తారక్ ఉండేట్టు అయితే 100 కాదు 200 కోట్లు పెట్టినా సరే సినిమా రిటర్న్ తెచ్చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube