అశ్వద్ధామగా వస్తున్న నందమూరి హీరో! మరో హిట్ గ్యారెంటీ!  

సోషియో ఫాంటసీ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కళ్యాణ్ రామ్. కెరియర్ లో మరో ప్రయోగం. .

  • నందమూరి ఫ్యామిలీలో రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా డిఫరెంట్ కథాంశంతో ఎప్పుడు ప్రయోగాలు చేసే హీరో కళ్యాణ్ రామ్. కెరియర్ లో మొదటి నుంచి తన సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ తన టేస్ట్ కి తగ్గట్లు కమర్షియల్ జోనర్ లోనే డిఫరెంట్ కంటెంట్ కథలని ఎంపిక చేసుకునే కళ్యాణ్ రామ్ కి పటాస్ సినిమా సాలిడ్ హిట్ ఇచ్చింది. కమర్షియల్ సినిమాగా వచ్చిన పటాస్ కళ్యాణ్ రామ్ కెరియర్ లో చాలా కాలం తర్వాత హిట్ ని అందించింది. తరువాత మళ్ళీ రొటీన్ కంటెంట్ కథలతో బోర్ కొట్టించిన కళ్యాణ్ రామ్ రీసెంట్ గా కెవి గుహన్ దర్శకత్వంలో 118 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

  • ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి మళ్ళీ హిట్ ఇచ్చింది. డిఫరెంట్ కథతో, గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి విపరీతంగా నచ్చేసింది. ఇదిలా వుంటే కళ్యాణ్ రామ్ 118 తర్వాత మరో సారి డిఫరెంట్ కంటెంట్ కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. సోషియో ఫాంటసీ కథకి తాజాగా కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మల్లిడి వశిష్ట ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వబోతునట్లు సమాచారం. ఇక ఈ సినిమా అశ్వద్ధామ టైటిల్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.