ఆ తప్పు వల్లే నా సినిమాలు ఫ్లాప్.. కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసిన హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు.అయితే ఈ హీరో నటించిన సినిమాలలో హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

 Kalyan Ram Sensational Comments About His Direction Movies Details, Kalyan Ram,-TeluguStop.com

మంచి కంటెంట్ తో తెరకెక్కినా కళ్యాణ్ రామ్ సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.అయితే తన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బింబిసార సినిమాకు ముందే ఓకే చెప్పిన ప్రాజెక్ట్ లలో ఇప్పుడు నటిస్తున్నానని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.అమిగోస్ సినిమాకు నేను ఫిక్స్ చేసిన టైటిల్ కరెక్ట్ అని ఆయన కామెంట్లు చేశారు.

సినిమా రంగంలో ఫ్లాపుల వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.కరోనా సమయంలో నేను చేసిన సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణాలేంటనే విషయాల గురించి తెలుసుకున్నానని ఆయన తెలిపారు.

Telugu Amigos, Bimbisara, Devil, Kalyan Ram, Flop, Nandamurikalyan, Sensational-

తనకు సినిమాలను మార్కెట్ చేసుకోవడం తెలియదని అలా తెలియకపోవడమే నాకు మైనస్ అవుతుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.వరుసగా సినిమాలు చేయడమే నాకు తెలుసని ఆయన తెలిపారు.డెవిల్ మూవీ ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు.అమిగోస్ మూవీ చూస్తే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేశాడనే భావన కలగదని కళ్యాణ్ రామ్ తెలిపారు.

Telugu Amigos, Bimbisara, Devil, Kalyan Ram, Flop, Nandamurikalyan, Sensational-

దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా అద్బుతంగా సినిమా తీశాడని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.కళ్యాణ్ రామ్ నమ్మకం నిజం అవుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.కళ్యాణ్ రామ్ మాత్రం తన సినిమా అమిగోస్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అమిగోస్ మూవీ విజయాన్ని సొంతం చేసుకుంటే మరిన్ని ప్రయోగాత్మక సినిమాల దిశగా కళ్యాణ్ రామ్ అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube