బాబాయి ప్రతిపాధనకు నో చెప్పిన అబ్బాయి?     2018-11-04   10:36:38  IST  Ramesh Palla

నందమూరి హరికృష్ణ మరణంతో బాలకృష్ణతో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు కలిసి పోయిన విషయం తెల్సిందే. ‘అరవింద సమేత’ చిత్రం సక్సెస్‌ వేడుక సందర్బంగా బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరు కావడంతో చర్చనీయాంశం అయ్యింది. కుటుంబంలో విభేదాలు తొలగి పోవడంతో పాటు, ఎన్టీఆర్‌, బాలయ్యల మద్య సన్నిహిత సంబంధాలు ఏర్పడటం, తెలుగు దేశం పార్టీకి మళ్లీ ఎన్టీఆర్‌ సన్నిహితుడు అవ్వడం జరిగింది. దాంతో ఎన్టీఆర్‌ను వాడేసుకోవాలని తెలుగు దేశం పార్టీ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది..

Kalyan Ram Says No To Balakrishna About Joining In Politics-

Kalyan Ram Says No To Balakrishna About Joining In Politics

ఈ సమయంలోనే కళ్యాణ్‌ రామ్‌ను బాలయ్య తెలుగు దేశం అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరడం జరిగింది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ బరిలో కళ్యాణ్‌ రామ్‌ పోటీ చేయాలని, ఎన్టీఆర్‌ ప్రచారం చేయాలని బాలయ్య భావించాడు. తెలంగాణలో తెలుగు దేశంకు మళ్లీ ఊపిరి ఊదాలంటే ఎలాగైనా కళ్యాణ్‌ రామ్‌తో పోటీ చేయించాలని ఎల్‌ రమణ కూడా బాలయ్యను కోరడం జరిగింది. పార్టీ ఖర్చు చేసి నిన్ను గెలిపిస్తుంది, హరికృష్ణ మరణం కళ్యాణ్‌ రామ్‌కు కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. కాని కళ్యాణ్‌ రామ్‌ మాత్రం నో చెబుతున్నాడు.

Kalyan Ram Says No To Balakrishna About Joining In Politics-

బాలయ్య ఎంతగా బతిమిలాడినా కూడా నో అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే ఆసక్తి తనకు లేదని, సెంటిమెంట్‌ను వాడుకోని గెలవాలనే తపన కూడా లేదు అంటూ కళ్యాణ్‌ రామ్‌ తనను సంప్రదించిన తెలుగు దేశం నాయకులకు తేల్చి చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. బాబాయి స్వయంగా ఫోన్‌ ద్వారా మాట్లాడినా కూడా ఫలితం లేకుండా పోయిందని సమాచారం అందుతుంది. అయితే కళ్యాణ్‌ రామ్‌ ఇప్పట్లో రాజకీయాలకు ఆసక్తి లేదని, సినిమాలు, వ్యాపారాలపైనే ఎక్కువ శ్రద్ద పెట్టాలని ఆయన భావిస్తున్నట్లుగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్‌ అంటున్నారు.