డెవిల్‌లో కళ్యాణ్ రామ్ పాత్ర అలా ఉంటుందా?

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల తన పుట్టినరోజున వరుసబెట్టి తన నెక్ట్స్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ హీరో నటించబోయే సినిమాల్లో ‘డెవిల్’ అనే స్పై థ్రిల్లర్ మూవీ కూడా ఉంది.

 Kalyan Ram Role In Devil Movie, Kalyan Ram, Devil, Tollywood News, Naveen Medara-TeluguStop.com

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన లుక్ సరికొత్తగా ఉండనుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే ఈ సినిమా కథ, అందులో కళ్యాణ్ రామ్ పాత్రకు సంబంధించి చిత్ర దర్శకుడు నవీన్ మేడారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

ఈ సినిమాను 1945 సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా పూర్తి ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శకుడు తెలిపాడు.

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తున్నాడని తెలిపాడు.కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర కొంచెం నెగెటివిటీతో కూడి ఉంటుందని దర్శకుడు తెలిపాడు.

అయితే ఈ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ధోతీ కట్టుకుని, గడ్డం పెంచి చాలా సరికొత్తగా కనిపించనున్నట్లు దర్శకుడు తెలిపాడు.ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌తో పాటు మిగతా నటీనటుల గురించిన పూర్తి వివరాలు త్వరలోనె వెల్లడించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.మరి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube