రా ఆఫీసర్ గా మారిపోయిన కళ్యాణ్ రామ్

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, బాలకృష్ణ తారక్ తర్వాత ఆ వారసత్వంలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్.ఓ వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు.

 Kalyan Ram Play Raw Agent Role In New Movie , Tollywood, Nandamuri Hero, Balakri-TeluguStop.com

కెరియర్ లో హిట్ రేషియో తక్కువగా ఉన్న అతనొక్కడే, పటాస్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించాడు.అలాగే ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి నడిచాడు.

కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాల వరకు ఉన్నాయి.అలాగే బోయపాటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే పటాస్ సినిమాలో అవినీతి పోలీస్ గా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రతో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో ఏకంగా రా ఏజెంట్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్ లో రాజేంద్ర అనే దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు.

చిత్రబృందం ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణను‌ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక రా ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.గతంలో పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణ రా ఏజెంట్ పాత్రలో నటించి మెప్పించాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్ చేసినటువంటి సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రలో నటించడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube