బ్రిటిష్ గూఢచారి పాత్రలో కనిపించనున్న కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నాడు.ఈ మధ్యకాలంలో సాలిడ్ హిట్ లేకపోయినా కూడా భారీ బడ్జెట్ చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 Kalyan Ram Pay British Spy In His Next Movie, Tollywood, Bimbisara Movie, Mythri-TeluguStop.com

అందులో వేణు మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో బింబిసార మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీ టైం ట్రావెల్ కథాంశంతో భిన్న నేపధ్యాలలో నడిచే కథాంశంగా ఉండబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ లో మరో సినిమాకి కూడా కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మూవీలో అయితే ఏకంగా త్రిపాత్రాభినయంలో కళ్యాణ్ రామ్ అలరించబోతున్నాడు.

Telugu Bimbisara, Naveen, Kalyan Ram, Mythri Makers, Tollywood-Movie

ఈ సినిమా కూడా షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఇది కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న చిత్రం.

ఇక ఇందులో ముగ్గురు కథానాయికలతో కళ్యాణ్ రామ్ రొమాన్స్ చేయబోతున్నాడు.ఇదిలా ఉంటే మరో విభిన్నమైన కథాంశం ఉన్న పీరియాడికల్ జోనర్ లో నడిచే చిత్రానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది.నవీన్ అనే నూతన దర్శకుడు ఈ మూవీతో పరిచయం కాబోతున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కె ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గూడచారిగా కనిపిస్తాడని తెలుస్తుంది.దీనిని బట్టి ఇండియన్ బ్యాగ్రౌండ్ లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి కథాంశంతో ఈ సినిమా తెరకేక్కనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube