ఎన్టీఆర్‌..లో కళ్యాణ్‌ రామ్‌ లేడా.. ఇది అన్యాయం  

నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎన్టీఆర్‌ అప్పట్లో సీఎంగా ఉన్న సమయంలో అబిడ్స్‌లో నివాసం ఉన్న ఇంట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు. బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానాతో పాటు ఇంకా పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. రాజకీయ నేపథ్యంలో కొన్ని సీన్స్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలోనే హరికృష్ణ పాత్ర గురించిన చర్చ ప్రస్తుతం సినీవర్గాల్లో జరుగుతుంది.

Kalyan Ram Not In Ntr Biopic-

Kalyan Ram Not In Ntr Biopic

‘ఎన్టీఆర్‌’ చిత్రంలో హరికృష్ణ పాత్ర తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సమయంలో హరికృష్ణ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఎన్టీఆర్‌ చిత్రంలో హరికృష్ణను ప్రముఖంగా చూపించాలని అంతా కోరుకుంటున్నారు. హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్‌తో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ మూవీలో కళ్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడు అంటూ ఆమద్య చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా కూడా చెప్పారు.

తాజా పరిణామాలు చూస్తుంటే ‘ఎన్టీఆర్‌’ మూవీలో హరికృష్ణ పాత్రను పరిమితం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా హరికృష్ణ పాత్రకు కళ్యాణ్‌ రామ్‌ను కాకుండా కొత్త నటుడిని ఎంపిక చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ మూవీలో కళ్యాణ్‌ రామ్‌ను ఎంపిక చేయక పోవడం అన్యాయం అంటూ నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ చిత్రంలో నందమూరి హీరోలు ఉండాలని కోరుకుంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎలాగూ ఉండడు. కనీసం కళ్యాణ్‌ రామ్‌ అయినా ఉంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.

Kalyan Ram Not In Ntr Biopic-

క్రిష్‌ మాత్రం హరికృష్ణ పాత్రకు ప్రాముఖ్యత లేకుండా స్క్రీన్‌ప్లేను ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్‌ కూడా ఎన్టీఆర్‌ చిత్రంలో నటిస్తున్నట్లుగా అప్పుడు చెప్పుకొచ్చాడు. కాని ఇప్పుడు ఆయన రియాక్షన్‌ ఏంటో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.