కళ్యాణ్‌ రామ్‌ సందెట్లో సడేమియా  

Kalyan Ram Movie Release In Sankranthi-kalyan Ram,mahesh Babu And Allu Arjun Movies Release In Sankranthi

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ వరుసగా ఫ్లాప్‌లు అవుతూ వస్తున్నాడు.దాంతో కాస్త గ్యాప్‌ తీసుకుని తాజాగా ఈయన ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో నటించాడు.ఈ చిత్రానికి సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహించాడు.షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.సతీష్‌ గతంలో శతమానం భవతి చిత్రాన్ని సంక్రాంతికి తీసుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Kalyan Ram Movie Release In Sankranthi-kalyan Ram,mahesh Babu And Allu Arjun Movies Release In Sankranthi-Kalyan Ram Movie Release In Sankranthi-Kalyan Mahesh Babu And Allu Arjun Movies Sankranthi

అందుకే సంక్రాంతి సెంటిమెంట్‌ను వర్కౌట్‌ చేసుకునే ఉద్దేశ్యంతో ఈ సినిమాను సంక్రాంతికే తీసుకు రావాలని నిర్ణయించుకున్నాడు.

Kalyan Ram Movie Release In Sankranthi-kalyan Ram,mahesh Babu And Allu Arjun Movies Release In Sankranthi-Kalyan Ram Movie Release In Sankranthi-Kalyan Mahesh Babu And Allu Arjun Movies Sankranthi

అయితే ఇదే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్దకు రాబోతున్న విషయం తెల్సిందే.మహేష్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తుండగా, ముఖ్య పాత్రలో విజయశాంతి నటిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రం కీలక సన్నివేశాల చిత్రీకరణ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పాటు బన్నీ ‘అల వైకుంఠపురంలో’ చిత్రంను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇలా రెండు భారీ చిత్రాలు విడుదల కాబోతున్న సమయంలోనే ఎంత మంచి వాడవురా సినిమాను కూడా విడుదల చేయబోవడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న విషయం.సినిమాపై చాలా నమ్మకం ఉండటం వల్లే సినిమాను సంక్రాంతికి విడుదల చేయలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

కాని కొందరు మాత్రం కళ్యాణ్‌ రామ్‌ను సందట్లో సడేమియా అన్నట్లుగా విమర్శిస్తున్నారు.ఆ విమర్శను తిప్పికొట్టి ఆ మంచి వాడు సక్సెస్‌ అవుతాడో చూడాలి.