ఈ సమయంలో వేడుకలు వద్దంటూ అన్నకు సూచించిన ఎన్టీఆర్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన అమిగోస్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.వచ్చే వారంలో భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.

 Kalyan Ram Movie Amigos Pre Release Update , Kalyan Ram , Amigos , Ntr , Pre Re-TeluguStop.com

అమిగోస్ సినిమా లో కళ్యాణ్‌ రామ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించిన తర్వాత ఏ తెలుగు హీరో కూడా ఆ సాహసం చేయలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు కళ్యాణ్ రామ్‌ ఆ ప్రయత్నం చేయడం జరిగింది.అమిగోస్ టైటిల్ కాస్త విభిన్నంగా ఉన్నా కూడా సినిమా విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చేరువ అయ్యే విధంగా సినిమా ఉంటుంది అంటూ పలు సందర్భాల్లో దర్శకుడు మరియు యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్ రామ్‌ లు అమిగోస్‌ యొక్క ప్రీ రిలీజ్ వేడుకకి రెడీ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Amigos, Kalyan Ram, Koratala Siva, Ntr, Taraka Ratna, Telugu, Tollywood-M

ఈ సమయంలోనే తారకరత్న హాస్పిటల్ లో ఉండగా ప్రీ రిలీజ్ వేడుక భారీ గా చేయడం కరెక్ట్‌ కాదు అంటూ కళ్యాణ్ రామ్‌ అన్న కు తమ్ముడు ఎన్టీఆర్‌ సలహా ఇచ్చాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.కానీ ఆ వార్తలు కచ్చితంగా నిజం కాదని.సినిమా విడుదల కు ముందు ప్రీ రిలీజ్ వేడుక చేయకుండా ఎలా ఉంటారు.

Telugu Amigos, Kalyan Ram, Koratala Siva, Ntr, Taraka Ratna, Telugu, Tollywood-M

అయినా ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.కనుక ఆయన గురించి ఆలోచన ఆందోళన అక్కర్లేదు.అందుకే కళ్యాణ్ రామ్‌ అమిగోస్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక జరగడం అందులో ఎన్టీఆర్‌ పాల్గొనడం కూడా జరుగుతుందని నందమూరి అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఎన్టీఆర్‌ 30 సినిమా షూటింగ్‌ కు సంబంధించిన హడావుడిలో ఉన్నాడు.

అతి త్వరలోనే ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube