బింబిసార కోసం భారీగా బరువు తగ్గిన కళ్యాణ్ రామ్.. వైరల్ ఫోటోలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.నందమూరి వారసులుగా ప్రస్తుత జనరేషన్ లో కళ్యాణ్ రామ్, తారక్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు.

 Kalyan Ram Loss Weight For Bibisara Movie Know Details, Bimbisara Movie, Kalyan-TeluguStop.com

ఇకపోతే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందగా కళ్యాణ్ రామ్ మాత్రం తెలుగులో అడపా సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.ఇకపోతే ఈయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇలా పలు సినిమాలలో నటిస్తూనే మరికొన్ని సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం బింబిసారా.

ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా విడుదల తెలుగు దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి పలు ఆశక్తికరమైన విషయాలు వెల్లడించారు.కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేయకముందు తన శరీర బరువు 28 కిలోలు ఉండేవాడినని తెలిపారు.

అయితే ఈ సినిమా కోసం తాను శరీర బరువు తగ్గాల్సి రావడంతో భారీ హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

Telugu Bimbisara, Kalyan Ram, Kalyanram, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈయన కష్టతరమైన వర్కౌట్స్ చేసి ఏకంగా తన శరీర బరువును 15 కిలోలు తగ్గించుకున్నారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈయన ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇలా ఈయన ఫోటోలు చూస్తుంటేనే ఈయనకు సినిమా పట్ల ఏ విధమైనటువంటి డెడికేషన్ ఉందో అర్థమవుతుంది.

ఏది ఏమైనా బింబిసార సినిమా కోసం కళ్యాణ్ రామ్ భారీగా కష్టపడినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

ఈ టీజర్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ తప్పకుండా ఈసారి హిట్టు కొడతారని నమ్మకం అందరిలోనూ ఉంది.మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube