దసరా బరిలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ధ్రువని రిలీజ్ చేసేందుకు సిద్ధమవగా అక్టోబర్ 7న రిలీజ్ డేట్ కన్ఫాం కూడా చేశాడు.ఇక దానికి ఓ వారం ముందు అనగా సెప్టెంబర్ 30న ఎనర్జిటిక్ స్టార్ రామ్ సంతోష్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న హైపర్ మూవీ రిలీజ్ అవుతుంది.
అయితే ఈ రెండు కాకుండా పూరి, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రాబోతున్న ఇజం కూడా దసరా బరిలో రాబోతుంది.టైటిల్ పోస్టర్ తోనే క్రేజ్ సంపాదించిన ఈ ఇజం సినిమాతో పూరి మరోసారి తనలోని కసిని చూపించేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఇందులో విశేషం ఏంటంటే ముగ్గురు రామ్ లు తమ సినిమాలతో ఈ దసరాను కలర్ ఫుల్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు.హైపర్ రామ్, ధ్రువగా రామ్ చరణ్, ఇజంతో కళ్యాణ్ రామ్ ఇలా ముగ్గురు రామ్ లు ఈ దసరా అంతా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.
మరి ఈ ముగ్గురిలో సరైన హిట్ సాధించి దసరా రాజుగా ఎవరు నిలబడతారో చూడాలి.
.