ఎన్టీఆర్ ని నమ్మి డబ్బులు పెడుతున్నారు     2016-12-21   22:07:34  IST  Raghu V

నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ ట్రాక్ రికార్డు గొప్పగా ఏమి లేదు. అప్పట్లో అతనొక్కడే, ఆ తరువాత పటాస్ తప్ప, కమర్షియల్ గా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎదురుదెబ్బలే ఎక్కువగా చవిచూసింది. ఇక ఈమధ్యకాలంలో మరీ ఘోరం .. కిక్ 2 మరియు ఇజం అతి దారుణంగా బోల్తపడ్డాయి. బయటకి చెప్పట్లేదు కాని, కళ్యాణ్ రామ్ అప్పుల్లోనే ఉన్నట్లు చెబుతారు ఫిలింనగర్ ప్రజలు.

మరి ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ – బాబి సినిమాని నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ తో సినిమా అంటే చిన్న వ్యవహారం కాదుగా. ఎంతలేదన్నా 40-50 కోట్లు కూడబెట్టాలి. మరి ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కి డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి?

ఇక్కడే యంగ్ టైగర్ బ్రాండ్ ఇమేజ్ పనికివచ్చింది. కళ్యాణ్ రామ్ కి పెట్టుబడులు ఎన్టీఆర్ పేరు మీద సమకూరుతున్నాయట. కొంతమంది సినిమాలో ఇన్వెస్ట్ చేస్తే, మరికొంతమంది ఫైనాన్స్ ఇస్తున్నారట. మొత్తానికి కళ్యాణ్ రామ్ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అయినా తనని కష్టాల నుంచి తప్పిస్తుందనే ఆశతో ఉన్నాడు.