ట్రైలర్ టాక్: తండ్రి కోసం దేనికైనా రెడీ అంటున్న మంచోడు!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా అన్ని పననులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది.శతమానం భవతి సినిమాతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

 Kalyan Ram Entha Manchivadavura Trailer Talk-TeluguStop.com

కాగా తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు పలు సినిమాలను మిక్సీలో వేసి తీసిన ట్రైలర్‌లా కనిపించింది.

ముఖ్యంగా శతమానం భవతి ఛాయలు ఈ సినిమాలో ఎక్కువగా కనిపించాయి.అటుపై తండ్రి కోసం దేనికైనా రెడీ అనే కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు.

ఈ పాత్రలో కళ్యాణ్ రామ్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి.ఇక సుహాసినీ, శరత్ బాబు లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు.

కళ్యాణ్ రామ్‌ను ప్రేమించే అమ్మాయిగా మెహ్రీన్ నటించింది.విలన్ పాత్రలో రాజీవ్ కనకాల ఓ సరికొత్త లుక్‌లో కనిపించాడు.

మొత్తానికి ఎంత మంచివాడవురా సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కేరాఫ్‌గా మారడమే కాకుండా తండ్రీకొడుకుల అనుబంధాన్ని మనకు చూపించనుంది.సంక్రాంతి బరిలో జనవరి 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube