తారక్ కోసం పరిగెడుతున్న కళ్యాణ్ రామ్  

Kalyan Ram Eager For Ntr Movie - Telugu Kalyan Ram, Ntr, Rrr, Telugu Movie News, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

Kalyan Ram Eager For Ntr Movie - Telugu Ntr Rrr News Trivikram

ఇక తారక్ ఈ పాత్రలో నటవిశ్వరూపం చూపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమా తరువాత తారక్ ఏ సినిమా చేస్తాడా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

కాగా తారక్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుక గతంలోనే ఒప్పుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ మధ్యలో తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ అదిరిపోయే స్క్రిప్టును తారక్‌కు వినిపించడంతో ఆయనతో సినిమా చేయడానికి తారక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా తారక్‌తో ‘జై లవకుశ’ సినిమాను తెరకెక్కించిన నందమూరి కళ్యాణ్ రామ్, తన తమ్ముడు ఎన్టీఆర్‌తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో తారక్‌తో వీలైనంత త్వరగా సినిమా చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్.

దీని కోసం పలువురు దర్శకులను ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేయాలని కళ్యాణ్ రామ్ కోరినట్లు తెలుస్తోంది.తారక్‌ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా కథ పవర్‌ఫుల్‌గా ఉండాలని ఆయన కోరాడట.

దీంతో తారక్‌తో సినిమా ఏ క్షణానైనా మొదలుపెట్టేందుకు కళ్యాణ్ రామ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి తారక్‌తో సినిమా చేసేందుకు కళ్యాణ్ రామ్ ఎందుకు ఆతృతగా ఉన్నాడా అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

తారక్‌తో హిట్ కొట్టాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నాడా అని పలువురు ఆలోచిస్తున్నారు.

తాజా వార్తలు