కోట్లలో నష్టాలు ... కళ్యాణ్ రామ్ ''సినిమా కష్టాలు''

నటుడిగా… నిర్మాతగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రయాణం సాఫీగా సాగడంలేదు.కథనానికి ప్రాధాన్యత ఇస్తూ కోట్లరూపాయలు పెట్టుబడిగా పెట్టి ఆయన నిర్మిస్తున్న సినిమాలు బాక్సపీస్ వద్ద బోర్లాపడుతున్నాయి.

 Kalyan Ram Cinema Kastalu-TeluguStop.com

ఆయన సినిమాలు నిర్మిస్తూ చేతులు కాల్చుకోవడం పరిపాటిగా మారిపోయింది.పోనీ హీరోగా ఏమైనా నిలదొక్కుకుంటున్నాడా అంటే అక్కడ కూడా అదే సీన్ రివర్స్ అవుతోంది.

ఈవారం విడుదల కాబోతున్న తన లేటెస్ట్ మూవీ ‘నా నువ్వే’ సినిమాను ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ రామ్ తాను తీసిన సినిమాల వల్ల వచ్చిన నష్టాల పై స్పందించాడు.

తాను సినిమాలు తీసి కోట్లు పోగొట్టుకున్నా తాను ఎప్పుడూ బాథపడలేదనీ దానికి కారణం తాను జూదం ఆడి డబ్బు పోగొట్టుకోలేదు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.సినిమాలు తీయడం అందులో విజయం సాధించడం అన్నది ఎవరికీ అంతుపట్టని సీక్రెట్ అని అంటూ ఏ సినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరికీ తెలియని విషయం అని అంటూ కేవలం అదృష్టం వలన మాత్రమే సినిమాలలో విజయాలు ఉంటాయి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

నేను ఎదుట వారి దగ్గర కఠినంగా ఉండలేను అన్న విషయాన్ని వివరిస్తూ ప్రస్తుత పరిస్థుతులలో కఠినంగా వ్యవహరించలేనివారు విజయాలను అందుకోలేరు అంటూ వేదాంత ధోరణిలో ఆయన మాట్లాడాడు.

ప్రస్తుత ఫిలిం ఇండస్ట్రీ పరిస్థుతుల పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.అన్నీ కలిసి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ ‘చైతన్య రథం’ నడిపిన తన తండ్రి హరికృష్ణ పాత్రలో తాను నటించబోతున్న విషయాన్ని చెప్పాడు కళ్యాణ్ రామ్

‘నా నువ్వే’ సినిమా గురించి మాట్లాడుతూ తాను చాలకాలం తరువాత చేస్తున్న లవ్ స్టోరీ ఇది అని చెపుతూ తనకు రొమాన్స్ సీన్స్ పట్ల ఉన్న భయాన్ని వివరిస్తూ ఇలాంటి సీన్స్ లో జూనియర్ అంత బాగా ఎలా చేస్తాడా అని తనకు అనిపిస్తుంది అంటూ లిప్ లాక్ సీన్స్ అంటే బెదిరిపోయిన సందర్భాన్ని వివరించాడు కళ్యాణ్ రామ్.

ఇక తన జీవితంలో ఎన్నో పరాజయాలు మరెన్నో ఆర్ధిక నష్టాలు ఎదుర్కున్నా వాటిని అన్నింటిని తట్టుకోవడంలో తన భార్య ఇచ్చిన సహకారాన్నిఎప్పటికి మర్చిపోలేనని చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube