కళ్యాణ్ రామ్ బింబిసార సెన్సార్ రివ్యూ వైరల్.. సినిమా అలా ఉందంటూ?

కెరీర్ తొలినాళ్ల నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరనే సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ పటాస్ తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే.

మరికొన్ని రోజుల్లో బింబిసార మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ఫలితం విషయంలో కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నరు.బింబిసార కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఈ సినిమా విడుదలైన తర్వాత బింబిసార పార్ట్2 దిశగా అడుగులు పడతాయని కళ్యాణ్ రామ్ అభిమానులు భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదనే సంగతి తెలిసిందే.కథ డిమాండ్ చేయడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడలేదని సమాచారం అందుతోంది.

మగధీర తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న బింబిసార సినిమాకు సంబంధించి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

Advertisement

చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ దక్కనుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు.ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉండనుందని సెన్సార్ సభ్యులు వెల్లడిస్తున్నారు.

2 గంటల 26 నిమిషాలు ఈ సినిమా రన్ టైమ్ కాగా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని సమాచారం.రిచ్ విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కిందని కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు