మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకుడిగా మారి చేసిన సినిమా 118.

 Kalyan Ram Another Movie With Kv Guhan Dil Raju , Kalyan Ram , Kv Guhan, Latest-TeluguStop.com

ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతో కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ అతని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్.కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా గుహన్ డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

నందమూరి కళ్యాణ్ రామ్ 20వ సినిమాగా ఇది వస్తుంది.ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం.

సినిమా ఎనౌన్స్ మెంట్ లో క్రైం సీన్ డునాట్ క్రాస్ అని పోస్టర్ వదిలారు అంటే ఈ సినిమా కూడా థ్రిల్లర్ అంశాలతో వస్తుందని తెలుస్తుంది.

ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరక్షన్ లో బింబిసారా సెట్స్ మీద ఉంది.

ఇదే కాకుండా ఏజెంట్ వినోద్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇక ఈ రెండిటితో పాటుగా ఇప్పుడు కెవి గుహన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

వరుస క్రేజీ సినిమాలతో కళ్యాణ్ రామ్ సత్తా చాటాలని చూస్తున్నారు.రొటీన్ కథలతో కాకుండా ఈసారి కొత్త ప్రయోగాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ మూడు సినిమాలతో తప్పకుండా ఆశించిన స్థాయిలో హిట్ కొడతాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube