ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్... స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?

నందమూరి హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక చాలాకాలం తర్వాత ఈయన బింబిసార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Kalyan Ram Amigos Coming To Ott ,kalyan Ram ,amigos ,tollywood , Ashika Ranganat-TeluguStop.com

ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఏకంగా త్విపాత్రభినయంలో నటించిన చిత్రం అమిగోస్.

ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా థియేటర్లో పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాని మార్చి 10 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వచ్చేసింది.నిత్యం విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అమిగోస్ అంటే స్నేహితులు అని అర్థం.ఇలా ఇందులో ఏకంగా మూడు విభిన్న పాత్రలలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నారని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.మరి థియేటర్లలో మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube