క్యూరియాసిటీ పెంచుతున్న118 ట్రైలర్! కళ్యాణ్ రామ్ కి హిట్ ఇస్తుందా!

కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా 118.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పైన మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీ నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా నటిస్తుంది.

 Kalyan Ram 118 Movie Trailer Release-TeluguStop.com

ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి సినిమా ఎ జోనర్ లో ఉండబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది.ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర నిర్మాతలు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఎమ్మెల్యే లాంటి ఎవరేజ్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్నా సినిమా కావడంతో దీనిపై నందమూరి ఫ్యాన్స్ లో కొంత క్యూరియాసిటీ నెలకొని వుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందికి వచ్చింది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లో కంటెంట్ ని దర్శకుడు కొంత వరకు రివీల్ చేసాడు అని చెప్పాలి.ఇదిలా వుంటే ఓ అమ్మాయితో కలిసి జర్నీ చేసిన తర్వాత ఆమె అనుకోకుండా ఓ ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది.

అయితే అసలు ఆ క్యారెక్టర్ అనేది లేదని అందరూ హీరోని నమ్మిస్తారు.దీంతో తన లైఫ్ లోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు, ఎలాంటి ప్రమాదంలో వుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.

ఇలాంటి ఇంటరెస్టింగ్ పాయింట్ తో నడిచే కథగా 118 తెరకెక్కుతుంది.ట్రైలర్ కాస్తా క్యూరియాసిటీ పెంచే విధంగా ఉందనే చెప్పాలి.అలాగే ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కంటే కాస్తా స్టైలిష్ గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.మరి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎ మేరకు హిట్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube