చైతూ ఇప్పటివరకు రాముడు.. ఇప్పుడు పక్కా కృష్ణుడు.. బంగార్రాజు డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

అక్కినేని హీరో నాగార్జున, తనయుడు నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం బంగార్రాజు.ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన మనందరికి తెలిసిందే.

 Kalyan Krishna Comments On Nagarjuna And Naga Chaitanya-in Bangarraju Pre Releas-TeluguStop.com

ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించింది.ఈ సినిమా నేడు అనగా జనవరి 14 సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్ లో విడుదల అయింది.

అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్రబృందం.ఈ వేడుకలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ నాగ చైతన్య నాగార్జున పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.ఈ సినిమాలో అందరికీ నమ్మకం నాగార్జున సార్, ఆయనపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేశాము అని తెలిపారు కళ్యాణ్ కృష్ణ.

ఈ సినిమాలో మా చిత్ర యూనిట్ అందరికీ అతనే మా కెప్టెన్.అందరూ చాలా కష్టపడి సంక్రాంతి టార్గెట్ గా పెట్టుకుని నాగార్జున దిశానిర్దేశం తో ముందుకు దూసుకెళ్తూ ఈ సినిమాని పూర్తి చేశాము అని చెప్పుకొచ్చారు.

ఇందులో నాగార్జున లో రొమాన్స్ కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న అంటే అందుకు గల కారణం నాగార్జున సార్ అని, ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తెలిపారు.

ఇకపోతే నాగ చైతన్య బంగారం అని చెప్పిన కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు 24 క్యారెట్ బంగారం కాస్త 48 క్యారెట్ అయింది అని తెలిపారు.ఈ నాలుగేళ్లలో నాగచైతన్య లో చాలా మెచ్యూరిటీ వచ్చిందని, నాగ చైతన్య లో ఉన్న క్లారిటీ ఎవరిలోనైనా ఉంటే హ్యాపీగా బతికే వచ్చు అని చెప్పుకొచ్చారు.నాగచైతన్య చూడటానికి సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తాడు కానీ సైలెంట్ కాదు.ఇప్పటివరకు నాగచైతన్య చేసినవి రాముడు క్యారెక్టర్ అయితే ఇప్పుడు చేసింది మాత్రం కృష్ణుడు క్యారెక్టర్ అని తెలిపారు.

రమ్య కృష్ణ ,కృతి శెట్టి కూడా బాగా నటించారు అని చెప్పుకొచ్చారు కళ్యాణ్ కృష్ణ.

Kalyan Krishna Comments On Naga Chaitanya I

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube