మెగా హీరో కళ్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' ట్రైలర్.. ఇంప్రెసివ్..!

మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ సినిమా కిన్నెరసానితో రాబోతున్నారు.రమణ తేజ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.

 Kalyan Dhev Kinnerasani Trailer Released Impressive, Kalyan Dhev , Kinnerasani ,-TeluguStop.com

ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.జనవరి 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే సస్పెన్స్, క్రైం, మిస్టరీ కథాంశాలతో వస్తుందని తెలుస్తుంది.

ట్రైలర్ మొదట్లో నీ ముందున్న సముద్రపు అలలను చూడు.కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయి.

కానీ సముద్రం వాటిని వదలదు,వదులుకోలేదు.నేను కూడా అంతే అంటూ ఓ ఫీమేల్ వాయిస్ తో వస్తుంది.

ఇక మధ్యలో కారణం లేని ప్రేమ.గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదూ అనే డైలాగ్ అదిరిపోయింది.

సినిమాకు మహతి స్వ సాగర్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది.సినిమాలో కళ్యాణ్ దేవ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

విజేత సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ కిన్నెరసానితో ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.నాగ శౌర్య ఆశ్వథ్థామతో ప్రతిభ చూపించిన రమణ తేజ తన సెకండ్ ప్రాజెక్ట్ గా కిన్నెరసాని సినిమాతో వస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube