మెగా బ్యాక్ గ్రౌండ్ తో టాలీవుడ్ హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇటీవలి కాలంలో సూపర్ మచ్చి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ చివరికి నిరాశ తప్పలేదు.
అయితే గత కొంత కాలం నుంచి మాత్రం విడాకులు వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు కళ్యాణ్ దేవ్.మెగాస్టార్ కూతురు శ్రీజ తో కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.
అయితే దీనిపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ గానీ కళ్యాణ్ దేవ్ దంపతులు గానీ స్పందించలేదు అని చెప్పాలి.ఇలా ఇటీవల వార్తల్లో నిలిచిన కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1990 ఫిబ్రవరి 11వ తేదీన కిషన్ కానుగంటి, జ్యోతి దంపతులకు జన్మించాడు కళ్యాణ్ దేవ్.అప్పటివరకు అతను ఎవరు అన్నది ఎవరికీ తెలియదు.
కానీ మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా తెరమీదికి వచ్చాడు.అయితే శ్రీజకు మొదట శిరీష్ భరద్వాజ్ తో పెళ్లయింది.
ఒక పాప కూడా పుట్టింది.కానీ ఆ తర్వాత విడాకులు తీసుకుంది.
ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దంపతులకు పాప పుట్టింది.అయితే కళ్యాణ్ కుటుంబానికి ఎన్నో వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 30 సొంత ఇంట్లో ఉన్నారు కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీ.మెగా బ్యాక్ గ్రౌండ్ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్.
శ్రీజ ను పెళ్లి చేసుకున్న తర్వాత స్నేహితులు చెప్పడంతో ఇక శ్రీజ ద్వారా హీరో అవ్వాలని తన ఆలోచనను చిరంజీవి ముందుకు తీసుకు వచ్చాడట కళ్యాణ్ దేవ్.అయితే కళ్యాణ్ దేవ్ హీరో అవ్వడానికి చిరంజీవి ముందు ఒప్పుకోకపోయినా.తర్వాత మాత్రం కూతురు శ్రీజ బలవంతం చేయడంతో ఒప్పుకున్నాడట.ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి నటించిన విజేత సినిమా టైటిల్ ని తన మొదటి సినిమా టైటిల్ గా మార్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్.
ఇక ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు.ఇక ఆ తర్వాత సూపర్ మచ్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికి తెలియదు.ఆ తర్వాత ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ దేవ్.
ఒక సినిమాకి ఏకంగా కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకుంటాడట ఈ మెగా అల్లుడు.