చిరంజీవి చిన్నల్లుడి గురించి రెండు హాట్ టాపిక్స్‌ నిజమా? కాదా?

మెగా స్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా విజేత చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెల్సిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

 Kalyan Dev Super Machi Movie Ott Release And Buchi Babu Movie News,social Media-TeluguStop.com

చిరంజీవి అల్లుడు అయినంత మాత్రాన సినిమాలు ఆడుతాయా అంటూ కొందరు విమర్శలు చేశారు.నటనలో లుక్‌ పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు.

దాంతో కాస్త గ్యాప్ తీసుకుని కళ్యాణ్‌ దేవ్‌ సూపర్‌ మచ్చి అనే సినిమాను మొదలు పెట్టాడు.ఆ సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం లేదు అంటూ స్వయంగా మెగా అభిమానులు అంటున్నారు.

ఇలాంటి సమయంలో చిరంజీవి చిన్నల్లుడు మరో సినిమాను కూడా చేసేందుకు సిద్దం అయ్యాడని దానికి ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.సూపర్‌ మచ్చి ఓటీటీ రిలీజ్ మరియు బుచ్చి బాబు దర్శకత్వంలో కళ్యాణ్‌ దేవ్‌ సినిమా వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో నిజ నిర్థారణ కోసం కొందరు ప్రయత్నించారు.

వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రెండు కూడా కన్ఫర్మ్‌ కాదు.అలా అని రెండు కూడా అబద్దం కాదు.

విషయం ఏంటీ అంటే థియేటర్లు లేని కారణంగా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి సూపర్‌ మచ్చి మేకర్స్ వచ్చారు.కాని ఏ ఓటీటీ కూడా కనీసం నిర్మాతలు పెట్టిన మొత్తంను ఇచ్చేందుకు సిద్దంగా లేదట.

పైగా వ్యూస్ ను ఆధారంగా అమౌంట్‌ ను ఇచ్చేందుకు కండీషన్స్ పెడుతున్నాయట.దాంతో ఈ సినిమా విడుదల విషయమై సస్పెన్స్‌ కొనసాగుతోంది.త్వరలో ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇక కళ్యాణ్‌ దేవ్‌ మూడవ సినిమా ను బచ్చి బాబు డైరెక్ట్‌ చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

ఆ దిశగా చర్చలు అయితే జరుగుతున్నాయి.కాని ఇప్పటి వరకు బుచ్చి బాబు నుండి కాని మెగా కాంపౌండ్ నుండి కాని ఎలాంటి స్పష్టత మాత్రం రాలేదు.

మొత్తంగా ప్రస్తుతం కళ్యాణ్‌ దేవ్‌ గురించిన రెండు వార్తలు కూడా పుకార్లే.త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube