ఆ 'హీరోయిన్'కి బాగా క్లోజ్ అయిన మెగా అల్లుడు?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒక చిన్న క్రికెట్ టీమ్ వచ్చింది.

 Kannada Actress Rachita Ram Birthday Wishes To Kalyan Dev, Kalyan Dev, Mega Fami-TeluguStop.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా అందరూ వచ్చారు.ఇక అలానే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా సెటిల్ అయ్యాడు.
ఇక ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన మొదటి చిత్రం విజేత సూపర్ హిట్ కొట్టింది.

మొదటి సినిమానే హిట్ కొట్టడంతో ప్రస్తుతం మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే ఇప్పటికే ఓ సినిమాతో ముందు రావాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

ఇక ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఆ సినిమానే సూపర్ మచ్చి.

ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సినప్పటికి కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది.

అయితే సూపర్ మచ్చి చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టనున్న కన్నడ నటి రచిత రామ్ కు బాగా దగ్గరయ్యాడు కళ్యాణ్ దేవ్.కన్నడ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ ఇప్పటికే సూపర్ మచ్చి చిత్రం షూటింగ్ ని పూర్తి చేశారు.

అయితే అక్టోబర్ 3 వ తేదీ కన్నడ బ్యూటీ రచితా రామ్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫోటో షేర్ చేశాడు.ఇక ఆ ఫొటోలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్టుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube