చిరు చిన్నల్లుడి రూటే సపరేటు.. టైటిల్స్‌తో కుమ్మేయాలనుకుంటున్నాడు  

Kalyan Dev 2nd Movie Title Khaidi-

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుండి వరుసగా హీరోలు ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే లెక్కకు మించి హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. తాజాగా చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్‌ దేవ్‌ మెగా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు...

చిరు చిన్నల్లుడి రూటే సపరేటు.. టైటిల్స్‌తో కుమ్మేయాలనుకుంటున్నాడు-Kalyan Dev 2nd Movie Title Khaidi

‘విజేత’ టైటిల్‌తో కళ్యాణ్‌ హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మెగా మూవీ అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు కాస్త ఈ చిత్రంపై నమ్మకం పెట్టుకున్నారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

విజేత చిత్రం విజయాన్ని దక్కించుకోవడంలో విఫం అయ్యింది. దాంతో కళ్యాణ్‌ దేవ్‌ రెండవ సినిమాపై మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కళ్యాణ్‌ దేవ్‌ మొదటి సినిమా టైటిల్‌ చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రం ‘విజేత’ టైటిల్‌ అనే విషయం తెల్సిందే.

చిరంజీవికి సూపర్‌ హిట్‌ను అందించిన ఆ టైటిల్‌ కళ్యాణ్‌ దేవ్‌కు అట్టర్‌ ఫ్లాప్‌ను మూట కట్టింది. విజేత టైటిల్‌ వల్ల కూడా కళ్యాణ్‌కు లాభం చేకూరింది లేదు. ఇక కళ్యాణ్‌ దేవ్‌ ప్రస్తుతం రెండవ సినిమాకు రెడీ అవుతున్నాడు.

కళ్యాణ్‌ రెండవ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించే అవకాశం ఉందని కొన్ని వారాల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక కళ్యాణ్‌ రెండవ సినిమా టైటిల్‌ గురించి అప్పుడే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

‘విజేత’ నిరాశ పర్చినా కూడా రెండవ సినిమాకు ఏమాత్రం గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే మొదలు పెట్టేయాలని భావిస్తున్నారు. అందుకోసం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా చకచక జరుగుతుంది. కళ్యాణ్‌ రెండవ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక కళ్యాణ్‌ రెండవ సినిమాకు ‘ఖైదీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో ఒకటి అయిన ‘ఖైదీ’ చిత్రం టైటిల్‌తో రావడం అంటే మామూలు విషయం కాదు...

చిరంజీవి కెరీర్‌ను టర్న్‌ చేసిన ‘ఖైదీ’ సినిమా టైటిల్‌ను ముట్టుకోవడానికి కూడా ఇతర హీరోలు టెన్షన్‌ పడతారు. కాని తన సినిమాకు చిరంజీవి హిట్‌ టైటిల్‌ను పెట్టుకోవడం అనేది కళ్యాణ్‌ చేస్తున్న మరో సాహస ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

మరి ఈ సాహస ప్రయత్నం ఏ ఫలితంను ఇస్తుందో చూడాలి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఆగస్టులో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఖైదీగా అయినా కళ్యాణ్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.