మెగా అల్లుడికి కరోనా నెగెటివ్.. కౌగిలించుకున్న కుటుంబం  

Kalyaan Dhev Tested Negative For Corona, Kalyaan Dhev, Super Machi, Corona, Mega Family - Telugu Corona, Kalyaan Dhev, Mega Family, Super Machi

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్, తన తొలి చిత్రం విజేతతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ కాకపోయినా హీరోగా ఆయనకు మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

 Kalyaan Dhev Tested Negative For Corona

ఇక ఈ సినిమా తరువాత తన రెండో సినిమాను ఓకే చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు కళ్యాణ్.అయితే పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా కళ్యాణ్ దేవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

‘సూపర్ మచ్చి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తుండగా రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

మెగా అల్లుడికి కరోనా నెగెటివ్.. కౌగిలించుకున్న కుటుంబం-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మొదలు కావడంతో కళ్యాణ్ దేవ్ కూడా తన సినిమాను ప్రారంభించాడు.అయితే ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కాకుండా విడిగా ఓ గదిలో ఉండసాగాడు.

ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ ముగిసిపోవడంతో కళ్యాణ్ దేవ్‌కు కరోనా పరీక్ష చేశారు.

కాగా కరోనా నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.

ఆయనకు కరోనా నెగెటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక పులి వాసు డైరెక్ట్ చేస్తున్న సూపర్ మచ్చి సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

#Corona #Super Machi #Mega Family #Kalyaan Dhev

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kalyaan Dhev Tested Negative For Corona Related Telugu News,Photos/Pics,Images..