భార్య లేకుండానే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ దేవ్.. వైరల్ ఫోటోలు!

గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారం గురించి వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే.సమంత మాదిరిగా శ్రీజ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన పేరును మార్చుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.

 Kalyaan Dhev Latest Stills Goes Viral Details,  Kalyan Dev, Latest Photos, Socia-TeluguStop.com

దీనితో వారిద్దరి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.అయితే ఈ విడాకుల వ్యవహారం గురించి వస్తున్న రూమర్లపై శ్రీజ, కళ్యాణ్ ఎవరూ స్పందించలేదు.

ఇది ఇలా ఉంటే కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

గత ఏడాది దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీలో కనిపించకపోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి సినిమాకు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా విషెస్ కానీ ప్రమోషన్స్ కానీ చేయలేదు.దీంతో ఆ వార్తలు మరింత బలపడ్డాయి.

ఇది ఇలా ఉంటే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ఫుల్ చిల్ అవుతున్నాడు.ఈ మధ్యకాలంలో కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.

తన మూడవ సినిమా ఆయన కిన్నెరసాని సినిమా ప్రమోషన్స్ లో బాగంగా బిజీ బిజీగా ఉంటున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణ్ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.వీకెండ్ లో ఏవిధంగా ఉంటాం.వీకెండ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాం.మూడు ఎలా మారుతుంది అన్న విషయాల గురించి కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube