'కల్కి' ట్రైలర్‌ టాక్‌ : సినిమాలో మ్యాటర్‌ ఉన్నట్లుగానే అనిపిస్తుంది

యాంగ్రీ యంగ్‌మన్‌ దాదాపు పుష్కర కాలం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.అంతుకు ముందు వరుసగా ఫ్లాప్‌లు రావడంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకున్న రాజశేఖర్‌కు గరుడవేగ మళ్లీ ఊపిరి ఊదినట్లయ్యింది.

 Kalki Movie Trailar Talk In Social Media-TeluguStop.com

గరుడ వేగ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రాజశేఖర్‌ సిద్దం అయ్యాడు.మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ చిత్రాన్ని రాజశేఖర్‌ చేశాడు.

'కల్కి' ట్రైలర్‌ టాక్‌ : సినిమా�

టైటిల్‌తోనే ఆకట్టుకున్న రాజశేఖర్‌ మరియు ప్రశాంత్‌ వర్మలు సినిమాపై ఆసక్తిని బిల్డ్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు.ఇక సినిమా విడుదల సమయంలో ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచారు.పీరియాడిక్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సీన్స్‌ ఆసక్తికరంగా సాగబోతున్నాయని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు దర్శకుడు చాలానే కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది.

రాజశేఖర్‌ లుక్‌ మరియు విలన్స్‌ను చూస్తుంటే మాస్‌ ఆడియన్స్‌కు విందు బోజనం తరహాలో ఉంటుందనిపిస్తుంది.

'కల్కి' ట్రైలర్‌ టాక్‌ : సినిమా�

రాజశేఖర్‌ గరుడవేగ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో సహజంగానే కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని, సినిమాలో మ్యాటర్‌ ఉందని ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని వర్గాల వారు కూడా ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి చిత్రం రాజశేఖర్‌ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుందా చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube