'కల్కి' ఎలా ఉందంటే 'గరుడవేగ'తో వచ్చింది దీంతో పోయింది

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’.ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.

 Kalki Movie Review And Collections1-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించాడని ట్రైలర్‌ మరియు టీజర్‌లు చూస్తుంటే అనిపించింది.తాజాగా సినిమా విడుదల అయ్యింది.

సినిమా సాదారణ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.సినిమా 1980 నేపథ్యంలో తెరకెక్కింది.

అయితే రాజశేఖర్‌ ఇంకా అక్కడే ఉండి సినిమా చేస్తానంటే ఈ తరం ప్రేక్షకులు ఒప్పుకోరు అంటూ ఈ చిత్రం ఫలితంతో వెళ్లడయ్యింది.

'కల్కి' ఎలా ఉందంటే 'గరుడవేగ'తో వ

పాత చింతకాయ పచ్చడి వంటి కథ మరియు కథనంతో తెరకెక్కడంతో ఈ చిత్రం బోర్‌ కొట్టించింది.ఏమాత్రం ఆకట్టుకోని నేటివిటీతో సినిమా ఫలితం బొక్క బోర్లా పడినట్లయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజశేఖర్‌ దాదాపు పుష్కర కాలం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఆ విజయాన్ని ఇన్సిపిరేషన్‌గా తీసుకుని మరిన్ని సినిమాలు చేయాలని రాజశేఖర్‌ వెంటనే ‘కల్కి’ చిత్రాన్ని మొదలు పెట్టాడు.

'కల్కి' ఎలా ఉందంటే 'గరుడవేగ'తో వ

‘అ!’ వంటి విభిన్నమైన చిత్రంను తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అంతా భావించారు.కాని కల్కి చిత్రంలో ఆయన పనితనం కనిపించలేదు.ఆయన దర్శకత్వంలో మరెవ్వరి ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి కల్కి చిత్రం మాత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.రాజశేఖర్‌కు మరో హిట్‌ వస్తుందని భావిస్తే నిరాశనే మగిల్చింది.

గరుడవేగతో వచ్చిన ఫేమ్‌ మళ్లీ ఈ చిత్రంతో పోయిందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube